Breaking News

కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్‌

Published on Fri, 03/28/2025 - 06:10

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో చోటుచేసుకున్న భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాక్‌ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్‌ ఆపరేషన్‌ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. 

రాజ్‌బాగ్‌ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్‌ సెక్టార్‌లో జమ్మూకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్‌ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. 

అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్‌ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)