Breaking News

ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌!

Published on Sat, 08/24/2024 - 19:45

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం, విజ్ఞాన్‌ ధార, ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనియన్ పెన్షన్ స్కీమ్న్(యుపిఎస్) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విజ్ఞాన్‌ ధార పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకురానుంది. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్‌ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి  అమలు కానుంది.

రిటైర్మెంట్‌కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో  సగం మొత్తం పెన్షన్‌గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు.

బయో ఈ-3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్‌ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుందన్నారు.

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)