Breaking News

స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు

Published on Wed, 07/09/2025 - 05:19

కడలూర్‌: పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న స్కూల్‌ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో విద్యార్థి, వ్యాన్‌ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కడలూరు–అలప్పక్కం రైలు మార్గంలో 170వ నంబర్‌ రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద మంగళవారం ఉదయం 7.45 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులున్న ఆ వ్యాను పల్టీలు కొట్టింది. అనంతరం విల్లుపురం–మైలాదుతురై ప్యాసింజర్‌ రైలును డ్రైవర్‌ నిలిపివేశారు. నుజ్జునుజ్జయిన వ్యానులోంచి స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు.

ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. వ్యాను డ్రైవర్, 12వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూలుకు ఆలస్యమవుతుందని, గేట్‌ తెరిచే ఉంచాలని వ్యాన్‌ డ్రైవర్‌ ఒత్తిడి చేయడం వల్లే గేటును తెరిచి ఉంచానని గేట్‌ కీపర్‌ అంటుండగా, తాము వచ్చేసరికే గేటు ఓపెన్‌ చేసి ఉందని వ్యాన్‌ డ్రైవర్, క్షతగాత్రుడైన విద్యార్థి చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ గేట్‌ కీపర్‌పై కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్‌ చేశారు. కాగా, స్కూలు విద్యార్థులను బయటకు తీసేందుకు వచ్చిన ఓ వ్యక్తి తెగిన విద్యుత్‌ తీగను తాకి షాక్‌కు గురయ్యారు.

అతడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై రైల్వే శాఖ ప్రజలను క్షమాపణ కోరింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)