Breaking News

సీఎం పినరయి విజయన్‌ నివాసానికి బెదిరింపులు

Published on Mon, 09/08/2025 - 15:55

తిరువనంతపురం: కేరళలో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఓ అగంతకుడు రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాల్లో బాంబుల్ని ఏర్పాటు చేసినట్లు బెదిరింపులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగింది.

సోమవారం ఉదయం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లా కోర్టుకు అధికారిక ఈ-మెయిల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. సీఎం పినరయి విజయన్‌తో పాటు తిరువనంతపురం జిల్లా కోర్టులో బాంబును పెట్టామనేది ఆ మెయిల్‌ సారాంశం. సీఎం పినరయి విజయన్‌ అధికారిక నివాసం,జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో 

బాంబు డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ (బీడీడీఎస్‌) జాగిలాలతో మోహరించింది. కోర్టు లోపల, పరిసర ప్రాంతాలు, సీఎం అధికారిక నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబులు ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కోర్టు అధికారిక మెయిల్‌కు బాంబు బెదిరింపులు మెయిల్స్‌ పంపిన  అగంతకుడిని గుర్తిస్తామని అన్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

28సార్లు బాంబు బెదిరింపులు
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేరళ రాష్ట్రానికి 28 సార్లు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. సీఎం పినరయి విజయన్‌ అధికారిక నివాసంతో పాటు రాజ్‌భవన్‌,ఎయిర్‌పోర్టు,కోర్టులలో బాంబులను అమర్చామని మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు అధికారికంగా విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)