Breaking News

రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు

Published on Fri, 06/21/2024 - 05:50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్‌ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్‌ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్‌–ఇన్‌చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. 

ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.  
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు