Breaking News

పోలవరం ప్రాజెక్టుకు కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ లేదు

Published on Fri, 08/11/2023 - 03:37

సాక్షి, న్యూఢిల్లీ: పోలవ­రం ప్రాజెక్టు వ్యయం రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ ఎత్తివేయడా­నికి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ పేర్కొందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. అంచనా వ్యయం పెరు­గు­దల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీ­ఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిఫారసు మేరకు కాంపొనెంట్‌ వారీ సీలింగ్‌ను సడలించినట్లు చెప్పారు.

ఈమే­రకు ఆయన గురువారం లోక్‌సభ­లో వైఎస్సార్‌సిపీ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. చెల్లింపులకు అర్హమైనప్ప­టికీ కాంపొనెంట్‌వారీ నియంత్రణవల్ల రూ.550.97 కోట్లు అబయె­న్స్‌లో ఉండిపోయా­యని, వాటిని ఇప్పుడు రీయింబర్స్‌ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

కృష్ణా ట్రిబ్యునల్‌ –2 గడువు పొడిగింపు
ఏపీ, తెలంగాణల మధ్య నదీ జలాల వివాద పరి­ష్కా­రానికి ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్‌–­2 కాలపరి­మితిని వచ్చే ఏడా­ది మార్చి 31 వరకు పొడిగించి­నట్లు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. ఈ­మేరకు ఆయన వైఎస్సార్‌సీపీ సభ్యుడు అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

ఏపీలో 307 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో 355 పబ్లిక్‌ ఈవీ (ఎలక్ట్రికల్‌ వెహి­కల్‌) ఛార్జింగ్‌ పాయింట్లు ఉండగా.. 307 అమలు­లో ఉన్నాయని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ వైఎస్సార్‌సీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

గిరిజనుల రక్షణకు చర్యలు
ఇటీవల గోదావరి వరదల నేపథ్యంలో వేలేరు­పా­డు, కుకునూరు, పోలవరం, చింతూరు, ఎటపాక, రంప­చోడవరం మండలా­ల్లోని నదీ పరిసర ప్రాంతాల్లో నివసించే గిరిజనుల రక్షణకు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. గోదావరి ఒడ్డుకు ఎలాంటి విఘాతం కలగకుండా జులై 17న అత్యధికంగా వరద నీరు సముద్రంలోకి విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు మార్గాని భరత్‌రామ్‌ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

నవంబరు 2024 కల్లా కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రహదారి
కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రహదారి ప్రాజెక్టు వచ్చే ఏడాది నవంబరుకల్లా పూర్తవుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ..  వైఎస్సార్‌సీపీ సభ్యుడు బాలశౌరి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.  

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)