Breaking News

ఆ మహానగరంలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్‌

Published on Thu, 03/13/2025 - 13:46

ముంబై: భారతీయుల కలల నగరం ముంబై(Mumbai) త్వరలో మరో ఖ్యాతిని కూడా దక్కించుకోబోతోంది. ముంబైలోని థానేలో 11 అంతస్థుల రైల్వే స్టేషన్‌ నిర్మితం కానుంది. ఈ రైల్వే స్టేషన్‌లో కేవలం రైళ్ల రాకపోకలే కాకుండా ప్రయాణికులకు వినోదాన్ని అందించే పలు వేదికలు కూడా సిద్ధం కానున్నాయి. ఈ రైల్వే స్టేషన్‌ పైభాగంలో అద్భుతమైన మాల్‌, ఆఫీస్‌ స్పేస్‌, రిటైల్‌ షాపులు కూడా ఉండనున్నాయి. ఈ ప్రాజక్టు పూర్తయితే రైల్వేశాఖకు భారీగా ఆదాయం సమకూరనుంది.

థానే రైల్వే స్టేషన్‌(Thane Railway Station)లోని 10ఏ ప్లాట్‌ఫారంలో తొమ్మిది వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టుకు కేటాయించనున్నారు. దీనితోపాటు 24,280 చదరవు మీటర్ల ప్రాంతాన్ని లీజుకు తీసుకోనున్నారు. ఈ లీజు 60 ఏళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రాజెక్టును 2026, జూన్‌ 30 నాటికి పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైల్వే స్టేషన్‌కు బస్సులు, మెట్రో సేవలను అనుసంధానించనున్నారు.

రైల్వే స్టేషన్‌ బేస్‌మెంట్‌(Basement)లో పార్కింగ్‌ సౌకర్యం కూడా కల్పించనున్నారు. ఇక్కడి నుంచే లోకల్‌ బస్సులు ఎక్కే అవకాశం కల్పించనున్నారు. పైఫ్లోర్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నారు. ఇక్కడ ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు కూడా  అనుమతి ఇవ్వనున్నారు. 

ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)