Breaking News

‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’

Published on Tue, 06/11/2024 - 09:55

జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య  నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.

అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని  ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ  వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు