Breaking News

ఉగ్రవాదం అంతానికి అమిత్‌షా ఉన్నత స్థాయి భేటీ

Published on Sun, 06/16/2024 - 11:16

ఇటీవల జమ్మూలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలు, అమర్‌నాథ్ యాత్రలో రక్షణ చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు(ఆదివారం) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితి, ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న తీరును హోం మంత్రికి వివరించనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీనికిముందు అమిత్ షా జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు.

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడులపై షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రియాసి, కథువా, దోడాలోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఒక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికుడు వీరమరణం పొందారు. ఒక పౌరునితో పాటు ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)