Breaking News

ఓటు హైజాక్‌ అయ్యిందా? సవాలు చేయండి..

Published on Wed, 05/08/2024 - 13:58

మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా?  ఏం ఫర్వాలేదు. నేనే అసలైన ఓటరును అని సవాలు చేయండి. టెండర్‌ ఓటేయవచ్చు!ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు.  మీకు టెండర్‌ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్‌ బ్యాలెట్‌ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్‌ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు.

ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో  ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్‌ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు బ్యాలెట్‌ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్‌ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్‌ పత్రాన్ని మడిచి కంపార్ట్‌మెంట్‌ బయటకి వచ్చి ప్రిసైడింగ్‌ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్‌ పత్రాన్ని టెండర్‌ ఓటుగా ప్రిసైడింగ్‌ అధికారి మార్క్‌ చేసి ప్రత్యేక ఎన్వలప్‌లో వేరుగా ఉంచుతారు. 

చాలెంజ్‌ ఓటు అంటే ..?  
ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును  అభ్యర్థుల పోలింగ్‌ ఏజెంట్లు రెండు రూపాయలు చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్‌ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్‌ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.  

అనుచితంగా ప్రవర్తిస్తే గెంటివేతే...
పోలింగ్‌ సమయంలో పోలింగ్‌ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను  ప్రిసైడింగ్‌ అధికారి  బయటకు పంపించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్‌ అధికారికి ఉన్నాయి. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు కానీ... విచక్షణ కోల్పోయి పోలింగ్‌ కేంద్రంలో ఓటింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయి.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)