ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Published on Fri, 01/03/2025 - 07:48

ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలుచోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు.. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది.. జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే, ఢిల్లీ నుంచి వెళ్లే, అక్కడి వచ్చే రైలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైలు సర్వీసులను రద్దు చేసినట్టు కూడా అధికారులు వెల్లడించారు.

సింగల్ డిజిట్ ఎముకలు కొరికే చలి..

ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కారణంగా చలి తీవ్రత పెరిగింది. దట్టమైన పొగమంచు సైతం అలుముకుంది. ఇటు తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువైంది. హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)