Breaking News

అభూజ్‌మడ్‌లో ఎన్‌కౌంటర్.. తెలుగు మావోయిస్టుల మృతి

Published on Mon, 09/22/2025 - 18:29

ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్‌మడ్ అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో.. 40 లక్షల రూపాయల చొప్పున రివార్డు ఉన్న ఇద్దరు తెలుగు మావోయిస్టులు మృతిచెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, మరో మావోయిస్టు కాదరి సత్యనారాయణ అలియాస్ కోస దాదా మృతిచెందినట్లు నారాయణపూర్ పోలీసులు తెలిపారు.

వీరిద్దరి స్వస్థలం కరీంనగర్ జిల్లా అని వివరించారు. రామచంద్రారెడ్డి వయసు 63 సంవత్సరాలు, సత్యనారాయణ రెడ్డి వయసు 67 సంవత్సరాలు అని వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు ఒక ఏకే-47 తుపాకీ, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక గ్రనేడ్ లాంఛర్‌,  మావోయిస్టు సాహిత్యం, ప్రచార సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

అభూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇప్పటి వరకు ఇద్దరు మావోల మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 

 

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు