Breaking News

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Published on Sat, 08/19/2023 - 12:24

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌ వద్ద రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఆగష్టు 18వ తేదీ ఢిల్లీ నుంచి రైలు బయల్దేరింది. 19వ తేదీ ఉదయం ఎస్‌ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే నాగ్‌పూర్‌లో ఆపేశారు. దీంతో ప్రయాణికులు బోగి దిగి బయటకు పరిగెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. 

ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని అంటున్నారు. 

ఉద్యావన్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ.. 
బెంగళూరులోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్‌ఆర్‌ స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ప్రకటించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)