Breaking News

Bihar Election: మొదటి నుంచి తేజస్వీ ఆధిక్యం

Published on Fri, 11/14/2025 - 09:19

రఘోపూర్: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతోంది. ప్రతిపక్షాల మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్  తన కుటుంబపు కంచుకోట అయిన రఘోపూర్ నుండి పోటీకి దిగారు. కౌంటింగ్‌ తొలి దశలో ఆయన ముందంజలో ఉన్నారు. వైశాలిలోని రాఘోపూర్ స్థానం ఫలితాల మొదటి రౌండ్ కౌంటింగ్‌లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ 4,463 ఓట్లు సాధించగా, బీజేపీకి చెందిన సతీష్ రాయ్ 3,570 ఓట్లు సాధించారు. ఆర్జేడీకి బలమైన కోట అయిన ఈ నియోజకవర్గంలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం 893 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇది ప్రజా విజయం అని, మార్పు తప్పక వస్తుందని, తాము  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రఘోపూర్ ఆర్జేడీకి బలమైన కోట. గతంలో తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్, అతని తల్లి రబ్రీ దేవి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2015 నుండి తేజస్వి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో, ఆయన 38,000 ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని  దక్కించుకున్నారు. ఈసారి బీజేపీ తన రఘోపూర్ అభ్యర్థిగా సతీష్ కుమార్ యాదవ్‌ను ఎన్నుకుంది. యాదవ్ 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి రబ్రీ దేవిని ఓడించారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కూడా రఘోపూర్‌లో తన అభ్యర్థిని నిలబెట్టింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)