Breaking News

‘నాన్నా.. ద్రోహం జరిగింది’: లాలూకు తేజ్‌ లేఖ

Published on Sun, 06/01/2025 - 11:25

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌(Tej Pratap Yadav) మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన తన తల్లిదండ్రులకు.. పార్టీలో తనకు జరిగిన ద్రోహంపై లేఖ రాసి, కలకలం సృష్టించారు. పార్టీ నుంచి తనకు బహిష్కరించిన కొన్నాళ్లు తేజ్‌ ప్రతాప్‌ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.

ఈ లేఖను తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాశారు. పార్టీలో తనకు జరిగిన ద్రోహం గురించి దానిలో వివరించారు. పార్టీలో జైచంద్ లాంటి ద్రోహులు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే వీరినే మీరు నమ్ముతున్నారని లాలూపై ఆయన ఆరోపించారు. తనకు కావలసినది తల్లిదండ్రుల ప్రేమేనని పేర్కొన్నారు. ‘నా ప్రియమైన మమ్మీ, డాడీ... నా ప్రపంచం మొత్తం మీ ఇద్దరి చుట్టూనే తిరుగుతుంటుంది. మీరు నాకు దేవుడి కంటే గొప్పవారు. మీ ప్రతి మాట నాకు దేవుని ఆదేశం లాంటిది. మీరు నాతో ఉన్నప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. నేను కోరుకునేది మీ నమ్మకం, ప్రేమ. ఇంకేమీ కాదు. నాన్నా.. మీరు లేకుంటే ఈ పార్టీ ఉండేది కాదు. కుట్రా రాజకీయాలు చేసే జైచంద్ వంటి దురాశపరులు కూడా ఉండేవారు కాదు.  అమ్మానాన్నలిద్దరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని తేజ్‌ ఆ లేఖలో రాశారు.
 

గతంలో తేజ్ ప్రతాప్.. అనుష్క యాదవ్(Anushka Yadav) అనే మహిళ పక్కన ఉన్న ఫేస్‌ బుక్‌ ఫోటోవైరల్‌గా మారింది. 12  ఏళ్లుగా వీరి మధ్య సంబంధం ఉంటుంటూ సోషల్‌ మీడియలో కథనాలు వచ్చాయి.  ఇది పార్టీని అంతర్గతంగా ఇబ్బందులలోకి నెట్టివేసింది. ఈ నేపధ్యంలో తేజ్ ప్రతాప్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి స్పందించిన తేజ్ ప్రతాప్.. తన ఫేస్‌బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, ఆ ఫొటో నకిలీదని, తనను అప్రతిష్టపాలు చేసే ప్రచారంలో భాగంగా  ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ వివాదం బీహార్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

ఇది కూడా చదవండి: COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)