Breaking News

లాలూ కొడుకు ఇంట చోరీ!

Published on Mon, 03/13/2023 - 18:15

పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బీహార్‌ పర్యావరణ, అటవీశాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ నివాసంలో దొంగతనం జరిగింది. జానపద కళాకారులు తన నివాసంలో ఖరీదైన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ సన్నిహితుడు మిసాల్ సిన్హా మార్చి 10న సచివాలయ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు ప్రదర్శన ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత ఇంట్లో రూ. 5 లక్షల విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ వస్తువుల గురించి సదరు కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే తేజ్‌ ప్రతాప్‌ నివాసంలో బృందావనం జానపద కళాకారులు ఏయే వస్తువులు అపహరించారనేది ఇంకా తెలియాలేదని స్టేషన్‌ ఇంచార్జ్‌ భగీరథ్‌ ప్రసాద్‌ తెలిపారు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)