బాలికపై హత్యాచారం కేసులో... 61 రోజుల్లోనే మరణశిక్ష

Published on Sat, 12/07/2024 - 05:24

కోల్‌కతా: ఈ ఏడాది అక్టోబర్‌లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి హత్యకు పాల్పడిన 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్‌లోని కోర్టు మరణ శిక్ష విధించింది. నేరం చోటుచేసుకున్న నాటి నుంచి కేవలం 61 రోజుల్లోనే విచారణ పూర్తవడం రికార్డు సృష్టించింది. దక్షిణ 24 పరగణాల జిల్లా జయ్‌నగర్‌లో అక్టోబర్‌ 4న ట్యూషన్‌ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్‌ సర్దార్‌ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చంపేశాడు. అప్పటికే ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది.

 దాంతో బాలిక హత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంతో నిందితుడిని కేవలం రెండున్నర గంటల్లోనే అరెస్ట్‌ చేశారు. అతడిచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బారుయిపూర్‌ పోక్సో కోర్టులో అక్టోబర్‌ 30న చార్జిషీట్‌ వేశారు. కోర్టు విచారణ నవంబర్‌ 4న మొదలై 26న పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులను విచారించారు. దోషి ముస్తాకిన్‌ సర్దార్‌కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్‌ సుబ్రతా చటర్జీ తీర్పు వెలువరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, న్యాయాధికారుల కృషిని ప్రశంసించారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)