7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడి

Published on Wed, 06/03/2026 - 14:05

సాధారణంగా  మనం ఆటోలో ప్రయాణిస్తున్నపుడు ఏమి ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. అసలు కంటే ఎక్కువ చార్జ్‌ వసూలు చేయకుండా, ర్యాష్‌గా డ్రైవ్‌ చేయకుండా,  మనల్ని ప్రశాంతంగా  గమ్యాన్ని చేర్చితే చాలు అనుకుంటాం, కదా. కానీ చెన్నైలో ఒక మహిళ  షేర్-ఆటో డ్రైవర్‌తో తనకు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో వైరల్ కథగా మారింది. తన ప్రయాణీకుల సేవ పట్ల చూపిన విలక్షణమైన విధానం  మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. పదండి మరి ఆ సంగతులేంటో తెలుసుకుందాం.

షోలింగనల్లూర్‌లో తనకు ఎదురైన ఒక ఊహించని ప్రయాణం గురించి వివరిస్తూ, @the_dharani_theory అనే ఇన్‌స్టాలో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. దీని ప్రకారం ప్రీమియం సౌకర్యాలున్న ఈ ఆటోలో అంతకుముందెన్నడూ  లేని గొప్ప అనుభవం ఎదురైంది.

షోలింగనల్లూరులో  ఆటో ఎక్కిన వెంటనే ఎడమ వైపున ఫ్రంట్‌లైన్, ఫెమినా, అవుట్‌లుక్ నుండి UPSC ప్రిపరేషన్ మ్యాగజైన్‌ల వరకు అన్నీ అప్‌డేటెడ్ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు ఉండటం చూసి ఆమె  ఆశ్చర్యపోయింది. ఇంతేనా.. చక్కగా పనిచేస్తున్న రెండు ఐప్యాడ్‌లు, ప్రయాణీకులందరికీ ఉచితంగా చాక్లెట్ బాక్సులు, గొడుగులు, ఒక మినీ కూలర్, కాఫీతో కూడిన ఫ్లాస్క్ ఉన్నాయి. ఆగండాగండి.. ఇంకా ఉన్నాయి. ఉచిత వైఫై , నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు , వైద్యులకు   ఆటో రైడ్‌ ఉచితం అన్న వాక్యాలు కూడా కనిపించాయి. అతని ప్లేలిస్ట్‌లో షకీరా పాడిన "వెనెవర్, వెరెవర్" నుండి మురుగర్ భక్తి పాటల వరకు ఉండటం విశేషం.

ఈ పోస్ట్ ఆటోలోని సౌకర్యాలను మాత్రమే కాదు ఈ ఆటో అన్న మనసారా పకలరిస్తాడు, నవ్వుతాడు , తన ప్రయాణికులను తీసుకువెళ్తున్నప్పుడు ముద్దుగా చిన్న చిన్న డ్యాన్సులు చేస్తాడు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 7 భాషలు మాట్లాడతాడు. ఈఆటో డ్రైవర్  అన్న ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం ప్రయాణీకులపై చెరగని ముద్ర వేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం
ఆ మహిళ వాహనం దిగడానికి కొద్ది క్షణాల ముందు కథ మరో ఊహించని మలుపు తీసుకుంది.మరో ప్రయాణికురాలు,కార్పొరేట్ ఉద్యోగి  ఆ డ్రైవర్‌ను గుర్తుపట్టి, అతను వృత్తి,  విద్యా రంగాలలో  ఆరితేరినవాడనే విషయాన్ని ఈమెకు వివరించింది. రెండేళ్ల క్రితం తన కళాశాలకు అతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. ఏడుసార్లు TEDX  స్పీకర్‌. గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలలో ఉపన్యాసాలు ఇస్తాడు. 

మరోవైపు ఈమె టీచర్‌ కావడంతో ముందుగానే తాను ప్రకటించినట్టు, ఎంత బలిమాలినా కూడా ఆమె దగ్గర్నుండి ఒక్కపైసా కూడా చార్జ్‌ తీసుకోలేదు. ఆటోలో సౌకర్యాలు, అతను సాధించిన విజయాలు ప్రత్యేకంగా అనిపించినప్పటికీ, పని, జీవితం పట్ల డ్రైవర్‌కు ఉన్న దృక్పథమే ఆ ప్రయాణం నుండి తాను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠమని పేర్కొన్నారు.  

అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు. "ఆ రోజు ఆయన నాకు ఒక విషయం అర్థమయ్యేలా చేశారు. మనమందరం మన ఉద్యోగాల గురించి ఫిర్యాదు చేస్తుంటాం, కానీ 'అన్న' నాకు ఒక విషయం నేర్పించారు. అదేంటంటే, మనం చేసే ఏ పనినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, మన చెడ్డ రోజుల్లో కూడా నూటికి నూరు శాతం కృషి చేస్తే, నిజాయితీగా పనిచేస్తే అందులో ఎలా విజయం సాధించవచ్చో. గుర్తుండిపోయే ఈ ప్రయాణానికి ధన్యవాదాలు @auto_anna."

'ఆటో అన్న'కు  నెట్టింట ప్రశంసలు
ఈ పోస్ట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. "ఆటో అన్న"గా పాపులర్‌ అయిన అన్నాదురైపై  ప్రశంసలు వెల్లువెత్తాయి. తాము కూడా ఈ ఆటోలో ప్రయాణించామంటూ మరికొంతమంది తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.  మొత్తానికి అందరూ చేసే వృత్తిని, గౌరవించడం, మనస్ఫూర్తిగా సేవలందించడం ముఖ్యమని  పేర్కొన్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)