Breaking News

Gurugram: భార్యను హతమార్చి.. ఫ్రెండ్‌కు వీడియో సందేశం పంపి..

Published on Tue, 09/30/2025 - 10:20

గురుగ్రామ్: ఇటీవలి కాలంలో క్షణికావేశంలో అఘాయిత్యాలకు, దారుణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత తనను తాను అదుపు చేసుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక జీవితంలో ప్రశాంతత కరువై, తగిన నిర్ణయాలు తీసుకోలేక పలువురు ఆత్మహత్యలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది.  

గురుగ్రామ్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుమార్ తన భార్య స్వీటీ శర్మతో ఏదో విషయమై గొడవపడ్డాడు. తరువాత ఆవేశంతో ఆమె గొంతు కోసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భా​ర్యపై దాడిచేసిన అనంతరం నిందితుడు అజయ్ కుమార్ (30), తన స్నేహితునికి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియో సందేశం పంపాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నివాసి కుమార్‌కు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌కు చెందిన స్వీటీ శర్మ(28)తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.

కాగా తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకోబోతున్నానని తనకు వీడియో సందేశం పంపాడని కుమార్‌ స్నేహితుడు పోలీసులు తెలిపాడు. కుమార్‌ పంపిన వీడియో సందేశంలో అతను భార్యతో గొడవ పడుతున్న దృశ్యాలున్నాయి. విషయం తెలియగానే పోలీసులు సెక్టార్ 37లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలో కుమార్‌ దంపతులుంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నారు. స్వీటీ శర్మశర్మ మృతదేహం నేలపై పడి ఉండటాన్ని వారు గమనించారు. అక్కడ వారికి పదునైన కత్తి కూడా లభ్యమయ్యింది. కుమార్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. కుమార్ తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు బావిస్తున్నారు. కాగా ఈ ఘటన వెనుక గల కారణం ఇంకా వెల్లడికాలేదు. అయితే స్వీటీ శర్మ కుటుంబ సభ్యులు కుమార్‌పై పలు ఆరోపణలు చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)