Breaking News

తరగతి గదిలో మొబైల్‌ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్‌ నో!

Published on Wed, 01/15/2025 - 09:02

భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి  మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన  ఆదేశించారు.

రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు.  ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు.  ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్‌ ప్రచార దాడి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)