TN: పీచు మిఠాయి విక్రయాలు.. తమిళనాడు సంచలన నిర్ణయం​

Published on Sat, 02/17/2024 - 18:53

చెన్నై: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే కాటన్‌ క్యాండీ(పీచు మిఠాయిల)పై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలున్నందునే నిషేదం విధించినట్లు తెలిపారు. 

రాజధాని నగరం చెన్నై వ్యాప్తంగా ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిల నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలించగా  కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌-బి అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.

రోడమైన్‌-బిని ఇండస్ట్రియల్‌ డైగా పిలుస్తారు. దుస్తుల కలరింగ్‌, పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఆహారంలో రంగు కోసం దీన్ని వాడరు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇదీ చదవండి.. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)