Breaking News

విజయ్‌కు 105 సీట్లు?

Published on Tue, 05/13/2025 - 08:42

సాక్షి, చెన్నై: విజయ్‌ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్‌ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ  ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్‌ సినీమా షూటింగ్‌ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు. 

ఆ పార్టీ వర్గాలు విజయ్‌ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్‌ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్‌ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్‌ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్‌ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్‌ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది. 

అలాగే డీఎంకే కూటమికి  75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ  తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్‌ చేసుకుంటుండడం గమనార్హం.  

   

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)