Breaking News

కి‘లేడి’.. సోషల్‌ మీడియాలో గాలం.. 15 మందిని పెళ్లి చేసుకొని..

Published on Wed, 02/15/2023 - 14:01

చెన్నై: ఓ మహిళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మందిని వివాహం చేసుకుని మోసం చేసింది. ఈ ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది.. కడలూరు జిల్లా బన్‌రూటి సమీపంలోని వాణియంపాళయం గ్రామానికి చెందిన అరుల్‌రాజ్‌ (25) చెరుకు కార్మికుడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి జీవితం సాఫీగా సాగింది.

అరుల్‌రాజ్‌ చెరుకు చెట్లు నరికే పనుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లేవాడు.. ఆ సమయంలో ఆ మహిళ తన బంధువుల వద్దకు వెళుతున్నానంటూ చెప్పి వెళ్లిపోయేది. ఈక్రమంలో 3 నెలల క్రితం అరుల్‌రాజ్‌ తన చెల్లెలు పెళ్లి కోసం 7 సవర్ల నగలు, రూ.90 వేల నగదు ఇంట్లో ఉంచాడు. ఈ డబ్బును తీసుకుని అరుల్‌రాజ్‌ భార్య వెళ్లిపోయింది.

ఎన్ని రోజులకూ రాకపోవడంతో గతంలో ఆమె చిరునామాకు వెళ్లి ఆరాతీశాడు. అయితే అది నకిలీ అడ్రస్‌ అని తేలింది. ఆమె ఇచ్చిన సెల్‌ఫోన్‌ నంబర్‌ కూడా వేరొకరిదని తేలింది. దీంతో అరుల్‌రాజ్‌ బన్‌రూటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అరుల్‌రాజ్‌ను వివాహం చేసుకున్న మహిళ వేలూరు, కోయంబత్తూరు, తిరువణ్ణామలై, ఈరోడ్‌కు చెందిన 15మంది యువకులను వివాహం చేసుకుని మోసగించినట్లు తేలింది.

సోషల్‌ మీడియా ద్వారా యువకులతో పరిచయం పెంచుకోవడం, ఆ తరువాత పెళ్లి చేసుకుని వారి నగదు, నగలతో ఉడాయించడం ఆమెకు అలవాటని స్పష్టమైంది. ఆమెను వివాహం చేసుకున్న వారు కూడా గతంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ మహిళ కోసంగాలిస్తున్నారు.
చదవండి: పెళ్లయిన నవమాసాలకే ఘోరం.. కడుపులో ఉంది ఆడబిడ్డ అని తెలియడంతో

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)