Breaking News

విషాదం: బస్సు డ్రైవర్కు గుండె పోటు.. 20 మంది పిల్లల్ని కాపాడి

Published on Fri, 07/26/2024 - 18:55

తమిళనాడు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్‌ డ్రైవర్‌ తను మరణిస్తూ.. 20 మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్‌ సాహాసాలను మెచ్చిన సీఎం స్టాలిన్‌ అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తిరూప్పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది..

వివరాలు.. వెల్లకోయిల్‌లో బుధవారం సెమలయ్యప్పన్‌ అనే 49 ఏళ్ల బస్సు డ్రైవర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నుంచి విద్యార్ధులను వాళ్ల ఇంటి వద్ద దింపడానికి  బయల్దేరాడు. దారి మధ్యలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రాడంతో బస్సు డ్రైవర్‌ అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.  అతని భార్య కూడా అదే స్కూల్‌లో హెల్పర్‌గా పనిచేస్తుంది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా అందులోనే ఉంది.

బస్సు రోడ్డు పక్కన ఆగిన కాసేపటికే అతడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే డ్రైవర్‌ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అతడు మరణించే ముందు సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ వీరోచిత చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మృత్యువు అంచున ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‘తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, అతను పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు మేము ఆయనకు నమస్కరిస్తున్నాము’. అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా.. మృతుడు సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.  డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్‌ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)