Breaking News

టీవీకే విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు.. తమిళనాడులో కలకలం

Published on Mon, 09/29/2025 - 08:56

చెన్నై: తమిళనాడులో(tamil Nadu) కరూర్‌(karur Incident) ఘటన తీవ్ర విషాదం నింపింది. అయితే, ఈ ఘటన అనంతరం.. టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కి(Vijay) బాంబు బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. అర్ధరాత్రి హుటాహుటినా విజయ్‌ ఇంటి వద్ద తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

వివరాల ప్రకారం.. తమిళగ వెట్రి కజగం (టీవీకే)Tamilaga Vettri Kazhagam (TVK) చీఫ్, నటుడు విజయ్ నివాసం నీలంకరైలోని ఈసీఆర్ వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు సోమవారం తెల్లవారుజామున ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో, అల‍ర్ట్‌ అయిన పోలీసులు.. బాంబు ‍స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బందితో విజయ్‌ నివాసం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇళ్లంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం, బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్‌ ఇంటి వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. కరూర్‌ ఘటన నేపథ్యంలో విజయ్‌ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్‌ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్‌ నివాసం వద్ద కేంద్ర సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరించాయి.

ఇక, కరూర్‌ ఘటనతో తీవ్ర మనోవేదనలో ఉన్న విజయ్‌ తన ఆవేదనను  ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రతీ ఒక్కరికీ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటి వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)