Breaking News

లేటు వయసులో ఘాటు ప్రేమ.. లవర్‌కు ఆస్తి రాసిచ్చేశాడు.. తర్వాత ట్విస్ట్‌

Published on Wed, 01/11/2023 - 08:55

సేలం: ‘‘కురువృద్ధుడైన నా భర్త అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేసి, మా ఆస్తిని మాకు అందించండి లేకుంటే కారుణ్య మరణానికైనా అమతివ్వండి’’ అంటూ 82 ఏళ్ల వృద్ధురాలు తన 90 ఏళ్ల భర్తపై కలెక్టర్‌కు మంగళవారం ఫిర్యాదు పేర్కొంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. సేలం జిల్లా ఓమలూరు తాలూకా డేనిస్‌పేట పెరియవడాగపట్టికి చెందిన పళనియప్పన్‌ (90). ఇతని భార్య పొన్నమ్మాల్‌ (82). ఈమె తన కుమార్తె కమలా (65)తో మంగళవారం కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చింది. అందులో.. తనకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారన్నారు. అనారోగ్యంతో కుమారుడు 70 ఏళ్ల వయసులో మరణించాడని పేర్కొంది. అయితే తన భర్త పళనియప్పన్‌ కుప్పాయి (70) అనే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించింది. అక్రమ సంబంధాన్ని వదులుకోవాలని పలుమార్లు తాము చెప్పినా పళనియప్పన్‌ వినిపించుకోలేదని వాపోయింది. 

పైగా ఇటీవల పళనియమ్మాల్‌ (70) అనే మరో మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పేర్కొంది. తమకు సొంతమైన లక్షల విలువ చేసే 6.5 ఎకరాల భూమిని పళనియమ్మాల్‌ పేరుతో రాసేశాడని ఆరోపించింది. అదేమిటని ప్రశి్నస్తే తాము మనవడితో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చివేస్తానని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వయసులో కూలి పనికి వెళ్లి పని చేసుకుంటూ కష్ట పడుతున్నానని, భర్త అక్రమ సంబంధాలను అడ్డుకుని, తన ఆస్తిని తిరిగి ఇప్పించి భద్రత కలి్పంచాలని కోరుతున్నాను.. అలా వీలుకాని పక్షంలో కారుణ్య మరణానికైనా  అనుమతివ్వాలని వేడుకున్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టి తగిన న్యాయం చేయాలని పోలీసు శాఖను కలెక్టర్‌ కార్యాలయం ఆదేశించింది.  
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి