కళ్లముందే మరొకరితో ప్రియురాలి తప్పు..!

Published on Mon, 07/21/2025 - 10:02

సాక్షి, చెన్నై : తనను ప్రేమించి పెళ్లికి సిద్ధపడ్డ ప్రియురాలు మరొకరితో మాట్లాతోందనే విషయాన్ని జీర్ణించుకోలేక ఓ ప్రియుడు ఉన్మాది మారాడు. ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపేశాడు. నాగపట్నంకు చెందిన దినేష్‌ (27), సౌందర్య(25) శ్రీపెరంబదూరు సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 

ఈ ఇద్దరు మేవలూరు కుప్పంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నట్టు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ ఇంటి యజమానికి తెలియజేసి అద్దెకు ఇళ్లు తీసుకున్నారు. పెళ్లి కాకుండానే ఈ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్న సమాచారం నాగపట్నంలోని తల్లిదండ్రులకు చేరింది. దీంతో ఇద్దరికి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తనతో పనిచేస్తున్న ఓ యువకుడితో సౌందర్య మరింత చనువుగా ఉండటం దినేష్‌ దృష్టికి చేరింది. ఈ విషయంగా ఆమెను మందలించాడు. అయినా, సౌందర్య అతడితో సన్నిహితంగా ఉండటం మొదలెట్టడంతో గొడవలు జరుగుతూ వచ్చాయి. 

శనివారం రాత్రి ఆ యువకుడితో సౌందర్య ఉండటాన్ని చూసిన దినేష్‌ ఉన్మాదిగా మారాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం కోపంతో ఇంటికి వెళ్లి పోయాడు. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సౌందర్య స్నేహితులు ఆదివారం ఉదయాన్నే ఆమె ఇంటి వద్దకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. 

శనివారం రాత్రి దినేష్‌ ,సౌందర్య మధ్య ఇంట్లో గొడవ జరిగడంతో కోపోద్రిక్తుడై ఆమెను కత్తితో పొడిచి చంపేసినట్టు తేలింది. పరారీలో ఉన్న దినేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సౌందర్య మృత దేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)