Breaking News

ఢిల్లీలో ఏం జరిగింది.. గవర్నర్‌ వెనక్కి తగ్గారా..? 

Published on Sun, 01/15/2023 - 07:40

సాక్షి, చెన్నై : రాష్ట్రం పేరు తమిళనాడు, తమిళగం అనే వ్యవహారంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వెనక్కి తగ్గారనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలో ఏం జరిగిందో ఏమో గానీ ఆయన తొలుత సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రికలో తమిళగం గవర్నర్‌ అని పేర్కొన్నారు. అయితే శనివారం విడుదల చేసిన సంక్రాంతి శుభాకాంక్షల్లో మాత్రం తమిళనాడు గవర్నర్‌ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది. 

వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ వ్యవహారం ఏకంగా ఢిల్లీకి చేరింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్పందించారు. విచారణ చేపట్టాలని కేంద్ర హోంశాఖను ఆమె ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి శనివారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని కీలక అధికారులను, ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహిత అధికారులను కలిసినట్లు సమాచారం. 

అక్కడ నుంచి వచ్చిన తరువాత సంక్రాంతి శుభాకాంక్షల ప్రకటనలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌రవి అని పేర్కొన్నారు. ఇక పొరుగు రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లెప్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ సంక్రాంతి వేడుకల్లో తమిళనాడు కావాలి.. తమిళగం కూడా కావాలని వ్యాఖ్యానించడం గమనార్హం.  

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)