Breaking News

తమిళనాడు సీఎం స్టాలిన్‌ ‘పొంగల్‌’ కానుక 

Published on Mon, 01/05/2026 - 06:07

చెన్నై: పంట చేతికొచ్చేవేళ తమిళ ప్రజలు ఆనందోత్సవాల నడుమ జరుపుకునే ‘పొంగల్‌’ పండుగను పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రతి రేషన్‌ కార్డు కుటుంబానికి రూ.3,000 నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. బియ్యంకార్డ్‌ ఉన్న ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదుతోపాటు ఒక కేజీ బియ్యం, ఒక కేజీ చక్కెర, ఒక చెరకుగడను ఉచితంగా పంపిణీచేయనున్నారు. 

ప్రజాపంపిణీ సేవా కేంద్రాల ద్వారా ఒక ధోతీ, ఒక చీర సైతం ఉచితంగా పంపిణీచేయనున్నారు. దీంతో 2.22 కోట్ల రేషన్‌ కార్డు కుటుంబాలతోపాటు శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాల్లోని కుటుంబాలు కూడా లబ్ధి పొందనున్నాయి. ఈ మొత్తానికి సుమారు రూ. 6,936.17 కోట్లు ఖర్చు అవుతుందని డీఎంకే సర్కార్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

తమిళనాడులో పొంగల్‌ సందర్భంగా ప్రతి ఏటా నిత్యావసర సరుకులు, కొంత నగదును బహుమతిగా ఇస్తోంది. 2011–16 కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇది కేవలం రూ. 100గా ఉండేది. ఆ తరువాత ఈ మొత్తాన్ని రూ.1,000కి పెంచింది. కొన్నేళ్లు నగదు బహుమతిని నిలిపేశారు. అయితే ఎన్నికల సంవత్సరం 2021లో ముఖ్యమంత్రి పళనిస్వామి నగదు సాయాన్ని ఒకేసారి రూ.2,500కి పెంచారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ఆ సాయాన్ని రూ.3,000కి పెంచింది. 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)