Breaking News

కోపమొచ్చింది.. టిక్కెట్‌ లేకుండానే 300 మంది రైలు ప్రయాణం

Published on Tue, 06/06/2023 - 13:40

కొరుక్కుపేట(చెన్నై): తిరుచెందూరు రైల్వేస్టేషన్‌లో టికెట్లు ఇచ్చేందుకు కౌంటర్‌లో సిబ్బంది లేకపోవడంతో 300 మంది టిక్కెట్‌ లేకుండానే తిరునెల్వేలికి ప్రయాణించారు. రైల్వే స్టేషన్లలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సిబ్బంది పనిచేస్తుండడంతో టిక్కెట్లు దొరకడం చాలా కష్టమని ప్రయాణికులు వాపోతున్నారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ నుండి  తిరునెల్వేలికి రోజూ ఉదయం 7.20, 8.25, 10.15, 12.20, మధ్యాహ్నం 2.30, 4.35, సాయంత్రం 6.15, రాత్రి 8.10 గంటలకు  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి.

పనుల నిమిత్తం తిరునెల్వేలికి వెళ్లే వారు ఉదయం 7.20, 8.25 గంటలకు ఈ రైలులో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాగే నజరేత్, శ్రీవైకుంఠం, కరడంగనల్లూర్, పాలై యంగోటై వంటి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు అధికంగా ఉండడంతో ఈ రెండు రైళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. సోమవారం ఉదయం 7.20 గంటలకు నెలైకి వెళ్లే రైలు ఎక్కేందుకు తిరుచెందూర్‌ రైల్వే స్టేషన్‌కు వందల మంది ప్రజలు క్యూ కట్టారు. కానీ టికెట్‌ ఇవ్వడానికి కౌంటర్‌ వద్ద ఉదయం 7.15 వరకు ఉద్యోగి ఎవరూ రాలేదు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు సిద్ధమయ్యారు.

అప్పుడు తమిళం తెలియని స్టేషన్‌ మాస్టర్‌ టిక్కెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే తనకు తమిళం రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో సుమారు 300 మంది ప్రయాణికులు తిరుచిరాపల్లి సెంథూర్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత టిక్కెట్లు లేకుండానే రైలు ఎక్కి అందరూ వెళ్లిపోయారు. తిరుచెందూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం డ్యూటీలో ఉండాల్సిన వ్యక్తి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సెలవు తీసుకోవడమే ఈ సమస్యకు కారణంగా తేలింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)