Flood Alert: ‘తాజ్‌’ గోడలు తాకిన ‘యమున’.. తరలివస్తున్న పర్యాటకులు

Published on Mon, 09/08/2025 - 13:09

న్యూఢిల్లీ: వరదల కారణంగా యమునా నది నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆగ్రాలోని అద్భుత తాజ్ మహల్ గోడలను యమునా నది తాకింది. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. యమునా నదిలో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో నది ఘాట్‌లు, చుట్టూ ఉన్న ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి.

పెరుగుతున్న నీటి మట్టాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దిగువ హిమాలయ ప్రాంతంలో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షపాతం కారణంగా యమునలోకి నీరువచ్చి చేరింది. 

 

 ప్రస్తుతం యమునలో నీటిమట్టం 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటిందని స్థానిక జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. దసరా ఘాట్, యమునా కారిడార్ సమీపంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

 

2023లో యమునలోని నీటి మట్టాలు కూడా ఇదే స్థాయికి చేరుకున్నాయని స్థానిక చరిత్రకారుడు రాజ్ కిషోర్ రాజే తెలిపారు. అయితే అన్ని పరిస్థితులను తట్టుకునేలా నిర్మించిన తాజ్ మహల్‌కు వరదల కారణంగా ఎటువంటి హాని జరగదన్నారు. ఆగ్రా జిల్లా యంత్రాంగం యమునలోని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యమునా నదిలోని నీటిమట్టం  206 మీటర్ల మార్కును దాటితే  సమీప ప్రజలను ఇక్కడి నుంచి ఖాళీ చేయవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Videos

YSR ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు.. కూకట్‌పల్లి లో YSRCP ఆందోళన

42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి

Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?

ఆపరేషన్ ‘రాటెన్ యాపిల్’.. న్యూయార్క్‌లో వేలాది మంది వలసదారుల అరెస్ట్

స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..

బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం

దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)