Breaking News

వాహ్..'తాజ్'

Published on Sun, 10/19/2025 - 05:45

సాక్షి, అమరావతి: తాజ్‌మహల్‌ అనగానే ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం మదిలో మెదులుతుంది. ఈ చారిత్రక అద్భుతాన్ని చూసి అబ్బురపడని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల మనసు దోచింది తాజ్‌ మహల్‌. కేంద్ర పర్యాటక శాఖ 2024–25 సంవత్సరాలకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ ఏడాది స్వదేశీ, విదేశీ పర్యాటకుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత విదేశీ పర్యాటకుల­ను ఆకర్షించడంలో ఆగ్రా పోర్టు రెండో స్థానంలో నిలవగా స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కోణార్క్‌ సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలి­చింది. 

2024–25లో తాజ్‌మహల్‌ను 6.45 లక్షల విదేశీ పర్యాటకులు సందర్శించగా స్వదేశీ పర్యాటకులు 62.64 లక్షల మంది సందర్శించారు. కోణా­ర్క్‌ సూర్య దేవాలయాన్ని 35.71 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు. ఆగ్రా కోటను 2.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2024–25లో దేశానికి మొత్తం 95,51,722 మంది విదేశీ పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా టాప్‌ 15  దేశాల నుంచే  76.70 లక్షల మంది విదేశీ పర్యా­టకులు దేశానికి వచ్చినట్లు పేర్కొంది. 

అత్యధికంగా అమెరికా నుంచి తరువాత బంగ్లాదేశ్‌  నుంచి విదేశీ పర్యాటకులు వచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు ఆరి్థక ఏడాదితో పోలిస్తే 2024–25లో విదేశీ పర్యాటకుల సంఖ్య 4.30 లక్షలు పెరిగారు. 2024–25లో భారత దేశానికి 99.51 లక్షల విదేశీ పర్యాటకులు రాకతో రోజూ సగటున 27,000 కంటే ఎక్కువ మంది దేశానికి వచ్చారు.

6.45 లక్షలు 2024-25లో తాజ్‌ మహల్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకులు   

62.64 లక్షలు 2024 -25లో సందర్శించిన స్వదేశీ పర్యాటకులు

2.24 లక్షలు 2024-25లో ఆగ్రాకోటను తిలకించిన విదేశీ పర్యాటకులు   

35.71 లక్షలు 2024-25లో కోణార్క్‌ సూర్య దేవాలయానికి వచ్చిన స్వదేశీ పర్యాటకులు   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?