Breaking News

తరగతి గదిని స్విమ్మింగ్‌ ఫూల్‌ చేసిన హెడ్మాస్టర్‌!

Published on Thu, 05/02/2024 - 07:44

ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు  తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్‌ పూల్‌లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్‌ పూల్‌ను ఏర్పాటు చేశారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్‌పుత్  మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్‌ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్‌ 30 వరకూ ఉంటాయి. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య