Breaking News

విశాఖ ఉక్కుపై శ్వేతపత్రం

Published on Wed, 10/09/2024 - 05:55

సాక్షి, న్యూఢిల్లీ : ‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయం నా ఒక్కడి చేతిలో లేదు. ఏం చేద్దామన్న విషయంపై మాకు సరైన స్పష్టత లేదు. ఈ అంశం విషయంలో ఆల్‌ పార్టీ నేతలతో మీటింగ్‌ పెడితే వాళ్లేం చెబుతారు? వాళ్లు రాజకీయ విమర్శలే కదా చేసేది? శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా. అందుకే దీనిపై వైట్‌ పేపర్‌ (శ్వేతపత్రం) రిలీజ్‌ చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

ఉదయం రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి.. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌లతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియా బృందంతో సమావేశం నిర్వహించి, ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం చాలా జఠిల సమస్య అని అన్నారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి మోదీని కలిసి ‘స్వర్ణాంధ్ర–2047’ డాక్యుమెంట్‌ను వివరించానని, పోలవరం నిధుల విషయంలో, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. 

విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన
విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా రూ.73,743 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌–­అమరావతి–చెన్నై–బెంగుళూరు–హైదరాబాద్‌ ప్రాంతాలను కనెక్ట్‌ చేస్తూ బుల్లెట్‌ ట్రైన్‌ తీసుకు రావాలని కోరానని తెలిపారు. 2026లో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అమరావతి–విజయవాడ రైల్వే లైన్, మచిలీపట్నం–రేపల్లె కనెక్టివిటీ, ఇక్కడ నుంచి కాకినాడకు కనెక్టివిటీ ఉండేలా పనులు ప్రారంభించాలని కోరామన్నారు.

రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అండర్‌ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని.. నడికూడి, శ్రీకాళహస్తి, కోటపల్లి, నర్సాపూర్‌ వంటి లైన్‌లను కూడా మార్చాలని కోరానని తెలిపారు. హైదరాబాద్‌–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ వేపై నితిన్‌ గడ్కరీతో చర్చించానని చెప్పారు. 189 కి.మీల అమరావతి ఓఆర్‌ఆర్‌పై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు.   

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)