Breaking News

నిరసనకారులకు చాక్లెట్లతో సమాధానం.. రాహుల్‌ వీడియో వైరల్‌

Published on Sun, 08/31/2025 - 09:50

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనపై విమర్శలు చేస్తున్నవారికి అత్యంత విచిత్రంగా సమాధానం చెప్పారు. బీహార్‌లోని ఆరాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న రాహుల్‌ గాంధీ తనకు ఎదురైన నిరసనకారులకు ప్రేమతో సమాధానం చెప్పారు. ఇటీవల బీహార్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ వేదికపైనున్న కొందరు నేతలు..  ప్రధాని మోదీ, ఆయన తల్లిపై దుర్భాషలాడారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇందుకు బాధ్యత వహిస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు రాహుల్ గాంధీ యాత్రకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టారు. తాజాగా ఆరా జిల్లాలో జరుగుతున్న ఈ నిరసనలకు రాహుల్ గాంధీ అనూహ్యంగా స్పందించారు. నిరసనకారులకు చాక్లెట్లు ఇచ్చి, సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే రాహుల్ యాత్ర మరింతమంది దృష్టిని ఆకర్షించింది.
 

కాంగ్రెస్ నేతలు ఈ వివాదాన్ని బీజేపీ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దర్భంగా ఘటనలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బీజేపీ ఏజెంట్ అని, యాత్ర జనాదరణను అడ్డుకోవడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. అయితే, బీజేపీ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ, రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టించింది.

రాహుల్‌ చేపట్టిన ఈ యాత్ర బీహార్‌లో  త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నదని పలువురు అంటున్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లతో పాటు ఇతర ఇండియా బ్లాక్ నేతలు ఈ యాత్ర ద్వారా ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తాజాగా రహుల్‌ చాక్లెట్ ఆఫర్ ఘటన.. రాహుల్ గాంధీ యాత్రకు సానుకూల దృష్టిని తెచ్చినప్పటికీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)