Breaking News

సీఎం కేజ్రీవాల్‌కు ఎంపీ స్వాతి మ‌లివాల్ ఘాటు లేఖ‌

Published on Tue, 07/02/2024 - 14:16

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీ, స్వాతి మలివాల్ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తాను గ‌త‌ జనవరిలో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం డీసీడబ్ల్యూని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, మెల్ల‌మెల్ల‌గా అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు.

లేఖ‌లో ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత స‌వాళ్ల‌ను ఆమె ఎత్తి చూపారు. తాను  2015 నుంచి నిర్మించిన వ్య‌వ‌స్థ‌ను (సీడ‌బ్ల్యూసీని ఉద్ధేశిస్తూ) ప్ర‌భుత్వం నాశ‌నం చేస్తోంద‌ని మండిప‌డింది. క‌మిష‌న్ బ‌డ్జెట్‌ను ఏక‌ప‌క్షంగా కోత‌లు విధించిన‌ట్లు తెలిపింది.

‘నా రాజీనామా తర్వాత కమిషన్‌కు జరిగిన అన్యాయం చాలా నిరుత్సాహపరిచింది. 181 మహిళా హెల్ప్‌లైన్‌ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం, కమిషన్‌కు నిధుల నిలిపివేత, కమిషన్‌కు బడ్జెట్‌లో కోత విధించ‌డం, కమిషన్ సిబ్బందిని తొలగించడం నాయకత్వ ప‌ద‌వులు ఖాళీలు వంటివి కమిషన్ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు.

రేప్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పేరొందిన నగరానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు(కేజ్రీవాల్‌).. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే వ్యవస్థలను రక్షించడం చాలా కీలకం.. సీఎం, మంత్రులు తక్షణమే జోక్యం చేసుకుని రాజధాని  మ‌హిళ‌లు, పిల్ల‌ల‌ను ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని పేర్కొన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)