Breaking News

మలివాల్‌ వాంగ్మూలం నమోదు

Published on Fri, 05/17/2024 - 05:36

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ ఆరోపించిన ఉదంతంలో పోలీసులు ముందడుగు వేశారు. ఈ విషయంలో ఇంతవరకు స్వాతి పోలీసులకు ఫిర్యాదుచేయలేదు. అయినాసరే పోలీసులే గురువారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్లిమరీ ఆమె వాంగ్మూలాన్ని రికార్డుచేశారు.

 సోమవారం కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన ఘటన వివరాలను ఇద్దరు సభ్యుల ఢిల్లీ పోలీసు బృందానికి స్వాతి వివరించింది. నాలుగున్నర గంటలపాటు అదనపు పోలీసు కమిషనర్‌ పీఎస్‌ కుషా్వహా బృందం స్వాతి ఇంట్లో వివరాలు సేకరించింది. వాంగ్మూలం నమోదు పూర్తయిన నేపథ్యంలో బిభవ్‌పై పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. 

సోమవారం దాడి ఘటన జరిగిన వెంటనే స్వాతి సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి విషయాన్ని చెప్పి వచ్చారుగానీ ఫిర్యాదుచేయలేదు. దీంతో ఇన్నిరోజులైనా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయాన్ని సూమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌ శుక్రవారం తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని బిభవ్‌ కుమార్‌కు సమన్లు జారీచేసింది.   

కేజ్రీవాల్‌ మౌనమేల?: బీజేపీ 
సొంత ఇంట్లో జరిగిన ఘటనపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. లక్నోలో పత్రికా సమావేశం సందర్భంగా కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో బీజేపీ విమర్శించింది. ‘‘ ఆయన మౌనం కూడా ఎంతో చెప్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు.  

బీజేపీ రాజకీయాలు ఆపాలి: స్వాతి 
దాడి ఉదంతాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీకి స్వాతి మలివాల్‌ హితవు పలికారు. ‘‘ ఆరోజు నా విషయంలో జరిగింది నిజంగా బాధాకరం. అందుకే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చా. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇందులో బీజేపీకి ఏం సంబంధం. వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయంచేయొద్దని బీజేపీ నేతలకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నా’’ అని స్వాతి   ‘ఎక్స్‌’లో హిందీలో పోస్ట్‌చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)