Breaking News

యువతి అనుమానాస్పద మృతి

Published on Sat, 07/26/2025 - 13:05

రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల చంద్రశేఖర్‌పూర్‌ పోలీసులు చంద్రశేఖర్‌పూర్‌ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్‌ సమితి గొరఖ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్‌ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్‌ నాయక్‌ చంద్రశేఖర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్‌పూర్‌ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్‌లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.   

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)