Breaking News

ఎల్‌ఓసీలోకి చొరబాటుదారులు.. కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌

Published on Tue, 08/06/2024 - 06:50

గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్‌వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు రాత్రిపూట లైట్లతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ల ద్వారా నిఘాను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అడవులు, కొండలు ఉండడంతో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

ఆర్టికల్ 370 రద్దుకు అయిదవ వార్షికోత్సవం దృష్ట్యా, ఖౌడ్, జ్యోడియన్ ప్రాంతాల్లో సైన్యం,  పోలీసులు ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు ఆ ప్రాంతానికి వచ్చిపోయే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు.

మరోవైపు సరిహద్దు భద్రతా దళం తాజాగా ఒక పాక్ చొరబాటుదారుడి మృతదేహాన్ని పాక్ రేంజర్స్‌కు అప్పగించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముహమ్మద్ అఫియల్‌గా గుర్తించారు. అతని మృతదేహాన్ని సుచేత్‌గఢ్ సెక్టార్‌లోని ఆక్ట్రాయ్ పోస్ట్‌లో పాకిస్తాన్ రేంజర్స్‌కు అప్పగించారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)