Breaking News

మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో సిట్‌ కీలక పురోగతి

Published on Mon, 06/23/2025 - 16:27

షిల్లాంగ్: మేఘాలయ హనీమూన్‌ హత్య కేసులో సిట్‌ అధికారుల దర్యాప్తులో పురోగతి సాధించారు. పెళ్లైన 11 రోజులకే తన భర్త రాజా రఘు వంశీ హత్య కేసులో సోనమ్‌ రఘువంశీ పాటు ఇతర నిందితుల సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిట్‌ దర్యాప్తులో సోనమ్‌కు సహకరించిన ప్లాటు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.    

నిందితురాలు సోనమ్‌ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత నిందితులు ఇండోర్‌లో ఓ ప్లాటును అద్దెకు తీసుకున్నారు. ఆ ఫ్లాట్‌ యజమాని ఓ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కంపెనీ యజమాని లోకేంద్ర తోమర్‌. అయితే, సోనమ్‌ ఉండేందుకు అద్దె ఇల్లు చూపించిన ప్రాపర్టీ డీలర్ సలోమ్ జేమ్స్‌ను పోలీసులు ప్రశ్నించడంతో లోకేంద్ర తోమర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల దర్యాప్తులో సోనమ్‌ అద్దెకు ఉన్న ఇంటి నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, ఆమె ఫోన్, రాజా నగలు, ఐదు లక్షల రూపాయల నగదును తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంతేకాదు, జేమ్స్‌ చెప్పిన వివరాల మేరకు.. సోనమ్ పోలీసులకు లొంగిపోయిన కొద్ది సేపటికే తోమర్.. జేమ్స్‌కు ఫోన్‌ చేశారు. సోనమ్‌ అద్దెకు ఉన్న ప్లాట్‌లో ఓ బ్యాగ్‌ ఉందని, వెంటనే దాన్ని తీసేయాలని కోరాడు. కానీ జేమ్స్‌ ఆ బ్యాగ్‌ను తీయించలేదు. అందుకే తమర్‌ ఆ బ్యాగ్‌ను తీసుకున్నాడు.తన ఫ్లాట్ సమీపంలోని కార్ షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తోమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఇండోర్‌లో అతని ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారని వర్గాలు తెలిపాయి. 

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)