Breaking News

మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే...

Published on Wed, 06/07/2023 - 10:33

ఒడిశా రైలు ప్రమాదం అనంతరం రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక బృందంలోని ఒకరు ఆ క్షణంలో వణికిపోయారు. మృతదేహాలలో నుంచి ఒక చెయ్యి అతని కాలును పట్టుకోవడంతో అతను నిలువెల్లా కంపించిపోయారు. గత శుక్రవారం (జూన్‌ 2) నాడు ఒడిశాలో రైలుప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో వందలమంది మృతి చెందారు. ఆ మృతదేహాలను ఒక స్కూలుగదిలో ఉంచారు.  అక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఆ గదిలోకి వెళ్లగానే మృతదేహాల్లో నుంచి ఒక చేయి అతని కాలు పట్టుకుంది.  దీంతో మొదట అతను భయపడిపోయారు. తరువాత తేరుకుని తన కాలు పట్టుకున్న శరీరాన్ని పరిశీలనగా చూశారు. అ శరీరంలోని రెండు కాళ్లూ తెగిపోయి ఉన్నాయి. అతని చేతులు సవ్యంగానే ఉన్నాయి. ఆ చేతులతోనే అతను రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వ్యక్తి కాళ్లు పట్టుకుని, తనను రక్షించాలంటూ వేడుకున్నాడు.

దీనిని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే బాధతుడిని ఆసుపత్రికి తరలించారు.  అక్కడి వైద్యులు బాధితునికి తక్షణం చికిత్స ప్రారంభించారు. ఇదిలావుండగా ప్రమాదం అనంతరం అధికారుల పరిశీలన, మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 278 మంది మృతిచెందగా, 1200 మంది గాయపడ్డారు. 

చదవండి: ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)