Breaking News

పరువునష్టం కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ కొట్టివేత

Published on Thu, 04/20/2023 - 11:19

గుజరాత్‌ కోర్టులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్‌ సెషన్స్‌ గురువారం కోర్టు కొట్టివేసింది. దీంతో ఇదే కేసులో రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించనున్నారు. 

కాగా 2019 కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్‌ గాంధీ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.

శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు నష్టంం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్‌ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా.. తీర్పును నేటికి రిజర్వు చేశారు. తాజాగా రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలన్న రాహుల్‌ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది.
చదవండి: భారీగా నమోదైన కోవిడ్‌ మరణాలు.. ఒక్క కేరళలోనే 11 మంది మృతి

రాహుల్‌పై నమోదైన కేసు ఏంటి?
2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. ఈ మేరకు నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ రాహుల్‌పై పరువు నష్టం కేసు వేయగా.. గత నెలలో సూరత్‌ దిగువ కోర్టు విచారణ జరిపి దోషిగా నిర్ధారించింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది.

ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఈ తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్‌ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌ సభ సచివాలయం రద్దుచేసింది. 
చదవండి: అతీక్‌ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)