Breaking News

సహజీవనంపై సుప్రీం సంచలన తీర్పు

Published on Mon, 08/03/2026 - 16:18

సాక్షి,ఢిల్లీ: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహాజీవనంలోనూ గృహాహింస కేసు వర్తిస్తుందని తెలిపింది. పెళ్లయిన మహిళలకు రక్షణ కల్పించే సెక్షన్‌ 498ఏ.. సహజీవనంలో ఉన్న స్త్రీలకు  అప్లై అవుతుందని  పేర్కొంది.  అయితే  ఆ సదరు మహిళ తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.

సహజీవనంలో (లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌) ఉండే మహిళలకు సైతం వివాహితల మాదిరిగానే భర్త లేదా భాగస్వామి వేధింపులపై రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహహింస చట్టం కేవలం గృహహింస నిరోధాకానికి మాత్రమే కాకుండా, క్రిమినల్ చట్టాలు ఇటువంటి బాధితులకు రక్షణ కల్పిస్తాయని కోర్టు తెలిపింది. అయితే దీనికి తప్పనిసరిగా ఇద్దరు  పరస్పర వివాహ అంగీకారంతో కలిసి ఉన్నప్పుడు  మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకాపమ్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తమతీర్పులో "భర్త లేదా అత్తమామలు ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించి, మానసిక లేదా శారీరక గాయం కలిగించడం లేదా మహిళను ఆత్మహత్యకు పురికొల్పడం వంటి వేధింపులకు పాల్పడే కేసులకు రక్షణ కల్పించడమే సెక్షన్ 498A యొక్క ఉద్దేశ్యం అయినప్పుడు, అటువంటి వేధింపులు కేవలం వివాహం తర్వాత మాత్రమే జరుగుతాయని, అంతకు ముందు కాదని చెప్పడం, మా సునిశ్చిత అభిప్రాయంలో, విషయాన్ని అతి సరళీకరించడమే అవుతుంది... సెక్షన్ 498A ద్వారా ఉద్దేశించిన రక్షణకు సంబంధించినంత వరకు, 'వివాహం'  'వివాహ స్వభావం గల సహజీవనం' మధ్య ఉన్న ఈ వ్యత్యాసానికి, గృహ హింసను నివారించే లక్ష్యంతో ఎటువంటి హేతుబద్ధమైన సంబంధం లేదు అందువల్ల ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం." అని తెలిపింది.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)