Breaking News

నోట్ల రద్దుపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు

Published on Mon, 01/02/2023 - 11:08

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మొత్తం అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ నాగరత్నం మాత్రం తన నిర్ణయాన్ని దీనికి వ్యతిరేకంగా వెలువరించారు. అధికారిక ఉత్తర్వుల ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం అమలు చేస్తే బాగుండేది అని తన తీర్పు ప్రతిలో వెల్లడించారు జస్టిస్ నాగరత్నం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటును విస్మరించడం సరైనది కాదని పేర్కొన్నారు జస్టిస్ నాగరత్న.

అయితే, మెజార్టీ జడ్జిలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నోట్ల రద్దు అంశంలో కేంద్రానికి ఉపశమనం లభించింది. పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్రం ఉద్దేశమే ముఖ్యమన్న సుప్రీంకోర్టు, ఆ ఉద్దేశాలు  నెరవేరలేదన్న కారణంతో నిర్ణయాన్ని కొట్టివేయలేమని తెలిపింది. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. 2016 నవంబర్‌ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్‌ సరైందనేనని బెంచ్‌ స్పష్టం చేసింది. 


జస్టిస్ నాగరత్న

నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ జరిగింది. జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలో.. బీఆర్‌ గవాయ్‌, ఏఎస్‌ బొప్పన్నా, వీ రామసుబ్రమణియన్‌, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తీర్పుపై స్పందిస్తూ.. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

అయితే జస్టిస్‌ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్‌ నాగర్నత ఒక్కరే విభేధించడం గమనార్హం. నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్‌ నాగరత్న తప్పుపట్టారు. ‘రహస్యంగా చేసిన ఈ చట్టం ఒక ఆర్డినెన్స్‌. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సింది’’ అని పేర్కొన్నారు.  

ఇక.. 2016లో వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆపై ఇరువర్గాల వాడి వేడి విచారణ పూర్తి కావడంతో.. ఇవాళ్టి తుది తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మాసనం మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)