Breaking News

ఇండ్రస్టియల్‌ ఆల్కహాల్‌పై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలదే

Published on Thu, 10/24/2024 - 05:59

న్యూఢిల్లీ:  పారిశ్రామిక(ఇండ్రస్టియల్‌) ఆల్కహాల్‌ ఉత్పత్తి, సరఫరా నియంత్రపై చట్టాలు చేసే చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచి్చన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని తేలి్చచెప్పింది. ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వెల్లడించింది. 

తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారీ్టతో బుధవారం తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్‌ నాగరత్న విభేదించారు. 1990లో సింథటిక్స్, కెమికల్స్‌ కేసులో అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇండ్రస్టియల్‌ ఆల్కహాల్‌ ఉత్పత్తిని నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచి్చంది. దీనిపై పలు అభ్యంతరాలు వచ్చాయి. 2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపించారు. ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ అనేది మానవ వినియోగం కోసం కాదని ఈ ధర్మాసనం పేర్కొంది.  

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు