Breaking News

ఆ ఊపిరి ఆపలేం!

Published on Tue, 10/17/2023 - 05:12

న్యూఢిల్లీ: 26 వారాల ఐదు రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ‘‘ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండటం వాస్తమేనని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు తేలి్చంది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది.

అంతేగాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్‌ (ఎంటీపీ)కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇప్పుడు అబార్షన్‌కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆస్పత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది.

చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకిద్దరు పిల్లలని, 2022 సెపె్టంబర్‌లో రెండో కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడో బిడ్డను కని పెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్‌కు అనుమతించాలని కోరింది.

ఆమెను పరీక్షించిన ఎయిమ్స్‌ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్‌ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్‌ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్‌ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్‌ 6న పంపిన ఈ మెయిల్‌ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునరి్వచారణ జరిపిన జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.వి.నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్‌కు అనుమతించినా, బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సీజేఐ ధర్మాసనం ముందుకొచి్చంది.
 
చట్టమూ అంగీకరించదు...
వివాహితలకు అబార్షన్‌ చేసుకునేందుకు ఎంటీపీ చట్టం ప్రకారం అనుమతించిన గరిష్ట గడువు 24 వారాలు. అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల వంటి బాధిత మహిళలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఈ గడువును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)