Breaking News

మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌లకు ‘సుప్రీం’ ఊరట

Published on Wed, 10/29/2025 - 04:43

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2013లో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకున్న 1,200 మంది మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లకు (ఎంపీహెచ్‌ఏ– పురుషులు) సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వీరి నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. జస్టిస్‌ అరవింద్‌కుమార్, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం, ఈ ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకు అనుమతిస్తూ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏళ్ల తరబడి న్యాయ పోరాటం 
2003లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2,300 ఎంపీహెచ్‌ఏ (పురుష) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకు ఇంటర్మీడియట్‌ +డిప్లొమాను అర్హతగా నిర్ణయించింది. ఆ తర్వాత అర్హతను పదో తరగతి + డిప్లొమాగా మార్చడంతో వివాదం మొదలైంది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా.. 2012లో పదో తరగతి + డిప్లొమా అర్హతనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. దీంతో అప్పటికే ఇంటర్‌ + డిప్లొమా అర్హతతో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న సుమారు 1,200 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
ఉద్యోగాలు కోల్పోయిన 1,200 మంది ఏళ్లపా టు అందించిన సేవలను పరిగణనలోకి తీసు కున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, మానవతా దృక్పథంతో 2013లో వారిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో కారుణ్య నియామకాల కింద తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, తెలంగాణ హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసింది. 

దీనిపై ఉద్యోగులు, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా 2003 నాటి నియామకాలతో సంబంధం లేకుండా, పూర్తిగా కారుణ్య కారణాల ఆధారంగానే 2013లో వీరిని తిరిగి నియమించామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ స్వతంత్ర నిర్ణయమని అంగీకరించింది. 

ఈ నేపథ్యంలో, 2013 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 1,200 మంది ఎంపీహెచ్‌ఏల ఉద్యోగాలను కొనసాగించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు శేఖర్‌ నాప్డే, మాధవి దివాన్, శ్రీరామ్‌ భాస్కర్‌ గౌతమ్‌ వాదనలు వినిపించారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)