Breaking News

ఇదెక్కడి తీర్పు.. అలాంటోడిని విధుల్లోకి తీసుకోవడమా?

Published on Tue, 01/13/2026 - 08:26

న్యూఢిల్లీ: రైలు బోగీలో అసభ్యంగా ప్రవర్తించిన సివిల్‌ జడ్జిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయాధికారితోపాటు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

మధ్యప్రదేశ్‌లో 2011లో నియమితులైన కాల్‌స్‌–2 సివిల్‌ జడ్జి ఒకరు 2018లో రైలులో ప్రయాణిస్తూ మద్యం మత్తులో తన బోగీలో ఇతర ప్రయాణికులను వేధించడంతోపాటు ఓ ప్రయాణికురాలిని బెర్త్‌కు ఎదురుగా మూత్ర విసర్జన చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దీతో, ప్రయాణికులు చైన్‌లాగి రైలును ఆపేశారు. ఆయన కారణంగా రైలు ఆలస్యమైంది. ఆ జడ్జిని అరెస్ట్‌ చేసిన రైల్వే పోలీసులు, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. 

విచారణ జరిపిన జబల్పూర్‌లోని స్పెషల్‌ రైల్వే మేజిస్ట్రేట్‌.. ఆ జడ్జిపై కేసును 2019లో కొట్టివేశారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఆ జడ్జిని విధుల నుంచి తొలగిస్తూ 2019లో ఉత్తర్వులిచ్చింది. అనంతరం జడ్జి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. ఫుల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే విధించింది. ఆ జడ్జిని 15 రోజుల్లోగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. 

ఈ తీర్పును హైకోర్టు పరిపాలనా విభాగం సుప్రీంలో సవాల్‌ చేసింది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, అసహ్యంగా ప్రవర్తించిన ఆ న్యాయాధికారిని డిస్మిస్‌ చేయాల్సిందేనని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని, సంబంధిత న్యాయాధికారితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.  

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)