Breaking News

ముంబై పేలుళ్ల కేసులో.. హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టు స్టే

Published on Thu, 07/24/2025 - 11:44

న్యూఢిల్లీ: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఇటీవలే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం అత్యున్నత న్యాయస్థానం నిలిపేసింది.  ప్రభుత్వ పిటిషన్‌పై వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 

నిర్దోషులుగా విడుదలైన 12 మందిని తిరిగి అరెస్ట్‌ చేయాలని చెప్పలేమంది. ‘ఈ కేసులో ప్రతివాదులందరినీ విడుదల చేశారు. మళ్లీ వారిని జైలుకు తీసుకొచ్చే ప్రశ్నే లేదు. అయితే, ఈ అభ్యంతరకరమైన తీర్పును మరే ఇతర కేసులలోనూ ఉదాహరణగా పరిగణించరాదు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. 

మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద ఉన్న ఇతర కేసులను హైకోర్టు తీర్పు ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొనడంతో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 189 మంది ప్రాణాలు తీసిన 2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించింది.

ముంబై పేలుళ్ల కేసు.. టైం లైన్‌

  • 2006 జూలై 11న ముంబై వెస్ట్రన్ రైల్వే లైన్‌లో 7 రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి.

  •  ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 827 మంది గాయపడ్డారు.

  • 2015లో ప్రత్యేక కోర్టు 5 మందికి మరణశిక్ష, 7 మందికి జీవిత ఖైదు విధించింది.

  • జూలై 21, 2025.. హైకోర్టు విచారణలో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది అని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రక్ పేర్కొన్నారు.

  • కన్ఫెషన్ స్టేట్మెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు, గుర్తింపు పరేడ్ వంటి ఆధారాలు నమ్మదగినవిగా లేవని కోర్టు అభిప్రాయపడింది.

  • తీర్పు ప్రకారం, వారు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

  • జులై 24.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)