Breaking News

మోహన్‌బాబుకు ‘సుప్రీం’ షాక్‌

Published on Thu, 05/01/2025 - 04:08

సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో విచారణ నుంచి తనకు మినహాయింపుతోపాటు స్టే ఇవ్వాలని కోరిన మోహన్‌బాబు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని మోహన్‌బాబు తరపు సీనియర్‌ న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ కోరారు. అంతేగాక మే 2న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని తమకు ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలని కోరగా... శుక్రవారం విచారణాధికారి ముందు కచ్చితంగా హాజరు కావాలని జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశించింది. 

అనుమతి లేకుండా ధర్నా చేయడంతో..
2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు కుటుంబం బైఠాయించింది. 

ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ధర్నా చేయడంతో.. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ కింద మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌కుమార్, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఏఓ తులసినాయుడు, పీఆర్వో సతీష్‌ౖ­పె చంద్రగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఈ కేసులో స్టే కోరుతూ మోహన్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)